![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ షో ముగింపుకి చేరుకుంది. ఈ తరుణంలో ఒక్కో హౌస్ మేట్ తమ అప్పీల్ ను ప్రేక్షకులకు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పీల్ అనేది చాలా కీలకం. ఎవరు ఎంత బాగా రిక్వెస్ట్ చేస్తారో వారికి అంత ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఈ అప్పీల్ పొందాలంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో గెలవాల్సిందే.
అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో అప్పీల్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. "ఈ టాస్క్ పేరు 'హెడ్ బాల్ టాస్క్'. ఇందులో విజేతగా నిలిచినవారికే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ టాస్క్ కి శ్రీహాన్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి ముగ్గురు ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ఆట ముగిసేసమయానికి కీర్తి ఫాస్ట్ గా వచ్చి గెలిచి, ఓట్ అప్పీల్ కి అర్హత సాధించింది.
ఆ తర్వాత 'ఓట్ ఫర్ మీ' ఫ్రేమ్ లో నిల్చొని తనకు ఓట్ వేయమని కీర్తి, ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది. "ఈ హౌస్ నా కోసం ఏం సింపతీ చూపించలేదు. నాకు కావలసింది మీ అందరి సపోర్ట్. ఇప్పటి దాకా మీ ఇంటి కూతురిలా చూసారు. నా శక్తి మీరి ఆడానని అనుకుంటున్నాను. ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నాను. ట్రోఫీ గెలిచాక కూడా నా సొంతంగా వాడుకోను. అది ఒక మంచి సోషల్ వర్క్ కోసం వాడుతాను. కీర్తి ఏమీ లేని అమ్మాయి. ప్లీజ్ ఓట్ వేయండి. అందరికీ ఓట్ వేయండి. నాక్కొంచెం ఎక్కువ ఓట్ వేయండి" అని కీర్తి భట్ చెప్పుకుంది.
![]() |
![]() |